"ఏడవాలనే భావన కలిగినప్పుడు తనివితీరా ఏడవాలి" అని చెప్తూ దక్షిణ భారతదేశంలోనే తొలి హెల్దీ క్రైయింగ్ క్లబ్ 'ను సికింద్రాబాద్ లోని గుజరాతి సేవ మండల్ భవనంలో మొదలుపెట్టారు. ఈ క్లబ్ ఫౌండర్ కమలేశ్ మసాలావాలతో పాటు పలువురు డాక్టర్లు, వందమంది క్లబ్ సభ్యులు ..అందరూ ఐదు నిమిషాలు ఏడ్చి తమ భారాన్ని తగ్గించుకున్నారు. ప్రతీ నెలా జరుగుతుంది ఈ ఈవెంట్. దీంతో ఏమొస్తుంది? ఈ ఏడుపు ప్రోగ్రామ్ వల్ల కలిగే లాభమేమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. .
గుండె ఆరోగ్యానికి కన్నీళ్లు మంచిదే
ఆధునిక జీవన శైలిలో వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరూ ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
ఈ ఒత్తిడితో బీపీ, గుండెపోటు, షుగర్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఇలాంటి భయంకరమైన ఒత్తిడిని సైతం ఏడుపు దూరం చేస్తుందని న్యూరో నిపుణులు అంటున్నారు. వ్యాయామం చేస్తే శరీరంలో హార్మోన్లు విడుదలై ఒత్తిడి దూరమువుతుందన్న సంగతి తెలిసిందే. ఏడ్చినప్పుడు మన శరీరంలో పీల్ గుడ్ కెమికల్స్ గా పిలిచే ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ వంటి హార్మోను విడదలవుతాయి.
ఇవి ఒత్తిడి, బాధ కారణంగా శరీరంలో విడుదలైన హార్మోన్లను కన్నీటితో బయటకు పంపించి శారీరక మానసిక ఒత్తిడి, నొప్పి, బాధల నుంచి ఊరటనిస్తాయని పలు పరిశోధనలు వెల్లడించాయి. ఏడ్చిన వ్యక్తి శరీరంలో మాంగనీష్ స్థాయి తగ్గి, ఆందోళన, సరాల ఉద్రిక్తత, కోపం, అలసట వంటి నెగిటివ్ భావాలన్నీ పోతాయట. దీంతో అప్పటివరకూ ఉన్న భారం తగ్గి, మానసిక ప్రశాంతత కలుగుతుందని, గుండెపై భారం తగ్గుతుందని క్రైయింగ్ క్లబ్ నిర్వాహకులు చెబుతున్నారు.
అయితే, ఏడవడం వల్ల సాంత్వన పొందడం లేదా హాని కలగడం అనేది పరిస్థితులను బట్టి ఉంటుంది. డిప్రెషన్, యాంగ్జయిటీతో బాధపడేవారు ఏడిస్తే అది వారికి మంచికన్నా చెడే ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే నెగెటివ్ నెస్ ను పోగొట్టుకుని పాజిటివ్ ప్రవర్తించగలిగే స్థితిలో వాళ్లుండరు. దాంతో శరీరానికి హాని కలిగే అవకాశం ఉంటుందని సైకాలజిస్టులు చెబతున్నారు.
కన్నీళ్లు కళ్ల మంచికే..
"ఏడ్చినప్పుడు వచ్చే కన్నీరు కంటికి మంచి చేస్తుంది' అని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. కనుగుడ్లకు, కనురెప్పలకు కన్నీళ్లు ఒక లూబ్రికెంట్ గా ఉపయోగపడతాయి. కనుగుడ్లను, రెప్పలను ల్యూబ్రికేట్ చేసి వాటి లోపలి పొరలను ఎండిపోకుండా చేస్తుంది కన్నీరు. ఆ పొరలు ఎండిపోయినట్లయితే చూపు మందగించే ప్రమాదం ఉంది.
►ALSO READ | ఈ సంగతి మీకు తెలుసా.. ఆటలకే కాదు.. ఏడ్వడానికి కూడా క్లబ్లుంటాయి..!
రోజూ వారి పనులలో శరీరం పై దుమ్ము దూళి చేరినట్లే కళ్లలో కూడా వివిధ రకాల క్రిములు, బ్యాక్టీరియా చేరతాయి. కన్నీటిలో ఉండే లైసోజైమ్ ఇతర రసాయనాలు యాంటీ బ్యాక్టీరియల్... యాంటీ వైరల్ ఏజెంటుగా పనిచేసి కళ్లలోకి చేరిన క్రిములు, బ్యాక్టీరియాను చంపేసి బయటకు పంపిస్తాయి. భగవద్గీతలోనూ కన్నీటి ఉపయోగాల ప్రస్తావన ఉంది. కళ్లతోపాటు ముక్కు రంధ్రాలను శుభ్రం చేసి, జలుబు, ఫ్లూను అరికడుతుంది.
పనిగట్టుకొని ఏడవండి!
భారం తీరాలంటే చిన్నాపెద్దా తేడా లేదు. అందరూ ఏడవాల్సిందేనని జపాన్ కు చెందిన ఓ పెద్దాయన ప్రచారం చేస్తున్నా డు. ఆయన పేరు యోషిడ ప్రస్తుత పరి స్థితుల్లో ఒత్తిడి ఎక్కువ మానసిక రోగాల వారిన పడుతున్నవాళ్లు ఎక్కువవుతున్నారు. కాబట్టి ఒత్తిడి తగ్గించుకునే మార్గాల్లో ఎడుపే మంచిదని అంటున్నాడు.
వారానికి.. ఒక్కసారన్నా పనికట్టుకుని ఏడవండి' అని చెవున్నాడు. జపాన్లోని బడి పిల్లలకు జె సినిమా చూపించి మరీ ఏడిపిం చాట చాలా సంస్థలు యోషిదాను పిలిచి పెరుపు గురించి ప్రత్యేక తరగతులు కూడా ఇప్పించుకుంటున్నారు. మానసిక వ్యాధుల తో కౌన్సిలింగ్లు తీసుకోవడం, మందులు వాడటం కంటే విరవడం మంచిదే కదా ఇంటున్నారు కొందరు..
–వెలుగు,లైఫ్–
